'బీఆర్ఎస్ నేతలకు కడుపుమంట ఎందుకు'

ATP: రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తుంటే, బీఆర్‌ఎస్ నేతలకు ఎందుకు కడుపుమంట అని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాలకు తలొగ్గి తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి లోకేష్‌ను విమర్శించడం తగదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.