ఏకగ్రీవమైన సర్పంచులకు సన్మానం చేసిన కేంద్ర మంత్రి
KNR: గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సామ రాజిరెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో శాలువాతో సన్మానించారు. రాజిరెడ్డి గ్రామస్థులతో కలిసి బండి సంజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులు త్వరలోనే అందిస్తానని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.