ప్రజా దర్బార్‌లో ప్రజల అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రజా దర్బార్‌లో ప్రజల అర్జీలు స్వీకరించిన మంత్రి

NDL: నంద్యాలలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించారు. రాజ్ టాకీస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా హాజరై తమ అర్జీలను సమర్పించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని మంత్రి సంబంధిత శాఖలకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.