విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుల్జా నాయక్, సావిత్రి దంపతుల కుమారుడు కార్తీక్ నాయక్ (19) శుక్రవారం సాయంత్రం ఇంటికి నీళ్లు పడుతుండగా విద్యుత్తు ప్రమాదం సంభవించి మృతి చెందాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.