మున్సిపల్ పోరు.. ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్
సూర్యాపేట: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఓటర్ల జాబితా విడుదల కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. అందరి దృష్టి ఇప్పుడు రిజర్వేషన్లపైనే నెలకొంది. సీట్లు మారుతాయేమోనన్న ఆందోళనలో నేతలున్నారు. ఎలాగైనా బరిలో నిలవాలని అభ్యర్థులు రెండేసి వార్డులపై కన్నేసి, అగ్రనేతల ప్రసన్నం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.