రాజోళి ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభినందనలు
GDL: రాజోళి మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ సంధ్య శ్రీరామ్ రెడ్డి, వార్డు సభ్యులను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అభినందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా సోమవారం వారిని పూల బొకేతో సన్మానించారు. అనంతరం మిఠాయి తినిపించుకొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.