ఇప్పటం విలేజ్ సర్వేయర్ సస్పెండ్
GNTR: ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నలుగురు సచివాలయ ఉద్యోగులపై వేటు పడింది. దరఖాస్తులపై వీరు మాన్యువల్ సంతకాలు అడుగుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కడప జిల్లా టీ.సుండుపల్లె, గుంటూరు జిల్లా ఇప్పటం విలేజ్ సర్వేయర్లను సస్పెండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు.