కాలిపోయిన మొక్కజొన్న పంట

GNTR: దుగ్గిరాల మండలం ఈమనిలో మొక్క జొన్న దంటుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బలమైన గాలుల వల్ల మంటలు పక్కనే ఉన్న కండెల కుప్పకు వ్యాపించాయి. దీంతో కండెలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు గోపి తెలిపారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.