నేడు ఎమ్మెల్యే పర్యటన రద్దు
KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గోకవరం మండలం పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామ వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి స్వయంగా దగ్గరుండి తరలించే క్రమంలో గోకవరం పర్యటన రద్దు అయింది.