ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో వాహనాలకు వేలం

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో వాహనాలకు వేలం

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో పలు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ నాగరాజు తెలిపారు. శనివారం ఉదయం బైకులకు వేలం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు న్నారు. పాల్గొనదలచిన వారు రూ. 1000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.