ఆగష్టు 16న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 16వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.