పంచాయతీరాజ్ విభాగ సెక్రటరీగా బాబీ

ELR: వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన మల్నీడి బాబి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. బాబీ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న తనని గుర్తించి ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి పని చేస్తానన్నారు.