ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: పోతురాజు

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: పోతురాజు

ASR: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తోందని ఉపాధి హామీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు అరకులో బుధవారం విమర్శించారు. కొత్త నిబంధనలతో లక్షలాది కూలీలు ఉపాధికి దూరమవుతున్నారని, దేశవ్యాప్తంగా 27లక్షల మంది పేర్లు డేటాబేస్‌ నుంచి తొలగించగా, అందులో మన రాష్ట్రం నుంచి 15లక్షల మంది ఉన్నారని తెలిపారు.