ముగ్గురు ఘరానా మోసగాళ్ల అరెస్ట్

ముగ్గురు ఘరానా మోసగాళ్ల అరెస్ట్

ATP: చెక్కర వ్యాపారం, సిగరేట్ ఏజెన్సీ పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులను రాయదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ వివరాల ప్రకారం ప్రధాన నిందితులుగా గార్లదిన్నెవాసి బెస్త ఓబుళేషు, పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, బెస్త మహేంద్రలు లక్ష రూపాయలకు రోజు రూ.3వేలు వడ్డీ ఇస్తామని వసూలు చేశారని తెలిపారు. ఇలా రూ.10కోట్ల వరకు వసూళ్లు చేసి మోసం చేసినట్లు తెలిపారు.