హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.21 మీటర్లు

HYD: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.