అభివృద్ధి అంటే రోడ్లేనా? నీటి కరువుపై పాలకుల నిర్లక్ష్యం

అభివృద్ధి అంటే రోడ్లేనా? నీటి కరువుపై పాలకుల నిర్లక్ష్యం

RR: నేటి పాలకులకు అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, ఫ్యాక్టరీల ఆదాయం మాత్రమే. కానీ నగరంలో నీటి కష్టాలు చూస్తుంటే.. నాడు రాజవంశాలు గొలుసుకట్టు చెరువులు నిర్మించి ఎంతటి ముందుచూపుతో వ్యవహరించారో అర్థమవుతుంది. ఇప్పటి పాలకులు ఉపాధి, ఆదాయంపై చూపే శ్రద్ధను జల వనరుల సంరక్షణపై చూపకపోవడం బాధాకరం. ఇప్పటికైనా అధికారులు చెరువుల పునరుద్ధరణ, నీటి వనరుల నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.