'రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కారు గుర్తుకే ఓటెయ్యాలి'

WGL: కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ఆగమవ్వద్దంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈరోజు పరకాల పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో వాకర్స్‌తో ముచ్చటించారు. అనంతరం కూరగాయల మార్కెట్,లేబర్ అడ్డా, బస్ స్టాండ్ కూడలి ప్రాంతాల్లో పర్యటించారు. MP బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్‌ని గెలిపించాలని కోరారు.