శ్రీ రెడ్డెమ్మ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపు
అన్నమయ్య: గుర్రంకొండ మండలంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 2 నెలలకు గాను నగదు రూ. 4,64,466, బంగారు 65 గ్రాములు, వెండి 195 గ్రాములు కానుకలు వచ్చినట్లు EO మంజుల మంగళవారం తెలిపారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం ఏపీ గ్రామీణ బ్యాంకులో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ ఛైర్మన్ లంకిపల్లె రాజయ్య నాయుడు, దేవాదాయ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.