సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యే టీఆర్ఆర్

సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యే టీఆర్ఆర్

VKB: పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి శనివారం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన ఆయన.. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.