VIDEO: నేడు పుంగనూరులో గరుడ వాహన సేవ

VIDEO: నేడు పుంగనూరులో గరుడ వాహన సేవ

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి గరుడసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ మునీంద్రబాబు తెలిపారు. గరుడ వాహనసేవ పట్టణంలోని తూర్పు మొగశాల వద్ద గల శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పాల్గొనాలని కోరారు.