ఓయూలో 2వ తెలుగు సాహిత్య మహాసభలు

ఓయూలో 2వ తెలుగు సాహిత్య మహాసభలు

HYD: ఓయూ వేదికగా ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ‘2వ తెలుగు సాహిత్య మహాసభలు-2026' ఘనంగా జరగనున్నాయి. ఓయూ తెలుగు శాఖ, ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో 'కవితా జిందగీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా కవి గోరటి వెంకన్న, హరీందర్ రెడ్డి, గున్న రాజేందర్ రెడ్డి రానున్నారు. ప్రొ. కాశీం సభాధ్యక్షత వహించనున్నారు.