ఎస్‌కోట సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ

ఎస్‌కోట సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ

VZM: ఎస్‌కోట సబ్ జైల్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. వీరికి పలు చట్టాలపై అవగాహన కల్పించినారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు గాని ఎటువంటి వివక్షత చూపించరాదని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను గూర్చి తెలియజేశారు.