బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే.

MBNR: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ అన్నారు. ఈ సందర్భంగా కొరవి మండలం కొత్తూరు సి గ్రామంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.