బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

WGL: చెన్నారావుపేట మండలం చింతల్ తండ గ్రామంలో ఇటీవల బానోతు భిక్య కుమార్తె స్రవంతి, ఆమె ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుల నివాసానికి వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.