'జగన్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశారు'

'జగన్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశారు'

PLD: రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు YS జగన్‌కు లేవని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం మంత్రి పార్థసారథి, MLA ఉగ్ర నరసింహారెడ్డితో రాజమహేంద్రవరం TDP సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జగన్ అధికారంలోకి వస్తూనే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ప్రజావేదికను కూల్చి చేసి విధ్వంసపాలనకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశారన్నారు.