రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆశ్చర్యం

బీహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) వివాదంపై సుప్రీంకోర్టులోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ విచారణ చేపట్టింది. డిలీట్ చేసిన ఓటర్ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీల తీరుపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని తెలిపింది. అలాగే, SIR ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉండాలని పేర్కొంది.