120 కేంద్రాలు.. 595 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, పీఏసీఎస్‌తో పాటు FPO ల ఆద్వర్యంలో 410 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 120 కేంద్రాలను ప్రారంభించారు. వరి కోతలు ఊపందుకోవడంతో 1,40,115 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కల్లాలకు వచ్చింది.