VIDEO: విజయవాడలో 105 మొబైళ్ల రికవరీ
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సాంకేతికతతో రూ.18 లక్షల విలువైన పోగొట్టుకున్న 105 మొబైళ్లను గుర్తించి బాధితులకు అందించారు. భారత హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన CEIR ద్వారా IMEI ఆధారంగా ఫోన్లు ట్రాక్ చేశామని సైబర్ క్రైమ్ DCP కృష్ణ ప్రసన్న తెలిపారు. ntrpolice.inలో ‘సైబర్ సురక్ష’ యాప్ ద్వారా అవగాహన పొందాలని, డిజిటల్ అరెస్ట్ మాటలు నమ్మొద్దని సూచించారు.