శిలువ మోసిన ఎమ్మెల్యే రాజా
కృష్ణా: GOOD FRIDAY సందర్భంగా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన పవిత్ర ర్యాలీలలో MLA వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలువను ఆయన మోశారు. మానవాళి రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన యేసు క్రీస్తును స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు, క్రైస్తవులు, కార్యకర్తలు పాల్గొన్నారు.