VIDEO: లింగాలలో శ్రీరామనవమి గోడపత్రిక విడుదల
NGKL: లింగాల మండల కేంద్రంలో శ్రీరామనవమి వేడుకల సన్నాహాలు మొదలయ్యాయి. శనివారం సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ, శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో కలిసి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.