VIDEO: రోడ్డు అద్వానంగా మారడంతో ఇబ్బందులు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ జోగినాధునిపాలెంలో రోడ్డు అధ్వానంగా మారింది. ముఖ్యంగా మలుపుల వద్ద గుంతలు ఏర్పడడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు పరిస్థితి ఇలానే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.