BV పురం సర్పంచిగా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలి.
SRPT: నడిగూడెం మండలంలోని బృందావనపురం సర్పంచ్‌గా సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని, సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో,బృందావనపురం శాఖ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా పోరాటాల్లో ముందుండి ప్రజల కోసం, నిరంతరం పనిచేస్తున్న సీపీఎం పార్టీని గెలిపించాలన్నారు.