డీఎస్సీ ఫలితాల్లో గృహిణికి 6వ ర్యాంక్

VZM: విజయనగరం పట్టణంలోని అయ్యన్నపేటకు చెందిన గృహిణి ఎడ్ల అనురాధ డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు. SGT ఫలితాల్లో జిల్లాస్థాయిలో 6వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. 2018 DSCలో 70 శాతం మార్కులు సాధించిన ఆమె.. తాజాగా విడుదలైన ఫలితాల్లో 92.8 శాతం మార్కులతో ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాన్ని సాధించాలని ఆమె తెలిపారు.