అభివృద్ది పనులను పరిశీలించిన సర్పంచ్

అభివృద్ది పనులను పరిశీలించిన సర్పంచ్

JN: నెల్లుట్ల 1, 2వ వార్డుల్లో డ్రైనేజీ వాటర్ గన్నేరు బావి దగ్గర స్టోరేజ్ కావడంతో బయటకు వెళ్లేందుకు చేపడుతున్న కాలువ నిర్మాణ పనులను సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామర కావ్య ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.