ఉపాధి పనులను పరిశీలించిన డ్వామా పీడీ

KDP: సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి, శేఖరాజుపల్లి,బొగ్గుడివారి పల్లి,గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో చేపట్టిన ఫారం పాండు పనులను శుక్రవారం ద్వామా PD ఆదిశేషారెడ్డి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనుల వల్ల రైతులకు నీటి నిల్వలను పెంచే అవకాశం ఉందన్నారు.