ఆంజనేయ స్వామిని దర్శించుకున్న గరికపాటి

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న గరికపాటి

ELR: మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని గరికపాటి నరసింహారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామిని ఆదివారం గరికపాటి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో ఆర్వీ చందన ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అర్చకులు పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.