రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పల్ల ప్రసాద్ ఎన్నిక
BHNG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పల్ల ప్రసాద్ ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. ఆయన మాట్లాడుతూ... ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని అన్నారు.