మైలారంలో రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలి మృతి
WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓర్చు ఐలమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఆమెను వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.