కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో ఎమ్మెల్యే సమావేశం
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందయ్య శాలువాతో సత్కరించారు. జగిత్యాల నియోజకవర్గంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో మెజారిటీ గ్రామపంచాయతీలలో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ప్రోత్సహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.