రహదారి భద్రతపై అధికారులకు అవగాహన

రహదారి భద్రతపై అధికారులకు అవగాహన

BDK: సుజాతనగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో భారతి ఆధ్వర్యంలో అధికారులకు రహదారి భద్రతపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న రోడ్డు భద్రతా వారోత్సవాలపై మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలపై ప్రజల్లో చైతన్యం కల్పించి, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.