తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. వాన దంచికొట్టడంతో విజయవాడలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివానతో పలు జిల్లాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి.