'ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యం'

VKB: ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాత గంజిలోని చౌక ధర దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు. 8,52,122 మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా 5,582 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు అన్నారు.