ఫ్లెక్సీలు, ప్లకార్డులపై ఎస్పీ హెచ్చరిక: వారిపై కఠిన చర్యలు

ఫ్లెక్సీలు, ప్లకార్డులపై ఎస్పీ హెచ్చరిక: వారిపై కఠిన చర్యలు

ప్రకాశం: ఒంగోలు జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని, మత సామరస్యాన్ని భగ్నం చేసేలా ఫ్లెక్సీలు, ప్లకార్డులు రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు వాటిలో ఉండరాదని, అలా ఉంటే వేయించిన వారితో పాటు ముద్రణా సంస్థలపై కూడా చర్యలు ఉంటాయని ఆయన మార్గదర్శకాలు విడుదల చేశారు.