రెండు రోజులుగా మళ్లీ పెరిగిన చలి
TG: రాష్ట్రంలో రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. 19 జిల్లాల్లో 12 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు దిత్వా తుఫాన్ వల్ల పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది.