హొళగుందలో పర్యటించిన ఎమ్మెల్యే విరుపాక్షి
KRNL: హొళగుంద మండలంలో గురువారం ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి పర్యటించారు. పలు గ్రామాల్లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, తాగునీరు, అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.