5 నెలలుగా ఉపాధి హామీ బకాయిలు.!
ASR: రాజవొమ్మంగిలో ఉపాధి హామీ కింద పనిచేసిన ఆరు వేల మంది కూలీలకు ఐదు నెలలుగా వేతనాలు అందలేదు. సొమ్ములు అందక ఆకలితో పస్తులు ఉంటున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల ఏపీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూలై నెల నుంచి ఇప్పటివరకు పనిచేసిన వారికి రూ. 1 కోటి 41 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపారు.