VIDEO: 700 ఏళ్లుగా వెలుగుతున్న 'అఖండ దీపం'

VIDEO: 700 ఏళ్లుగా వెలుగుతున్న 'అఖండ దీపం'

SRCL : గంభీరావుపేట మండల కేంద్రంలో సుమారు 7 శతాబ్దాల క్రితం కాకతీయ కాలంలో నిర్మించిన సీతారామస్వామి ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా విరాజిల్లుతోంది. కాకతీయ కాలంలో వెలిగించిన దీపం, 'అఖండ దీపం'గా నేటికీ దేదీప్యమానంగా వెలుగుతుండటం విశేషం. ఇక్కడ మూల విరాట్ భద్రాచల రామయ్యను పోలి ఉండటం విశేషం. ఇవాళ శ్రీ రామనవమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.