రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

అన్నమయ్య: రాజంపేట మండలంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడ్డారు. రాజంపేట నుంచి నందలూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం, హస్తవరం నుంచి రాజంపేట వైపు వస్తున్న మరో బైక్‌ను ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి చేర్చారు.