ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి
కృష్ణా: మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓపీ, రిజిస్టేషన్లను పరిశీలించారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.