రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
మంచిర్యాల: దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య తెలిపారు. రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గుడిరేవు పాఠశాలకు చెందిన బొమ్మన ఆద్విక, బొంగురాల మాన్వి ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.